బాపట్ల జిల్లాలో మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం 100 శాతం రాయితీతో నాచు సాగును ప్రోత్సహిస్తోంది. తీరప్రాంతాల్లో నాచు పెంపకాన్ని విస్తృతం చేయాలని సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 యూనిట్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని, దీనివల్ల మత్స్యకారులకు అదనపు జీవనోపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.