TG: రాష్ట్రంలో కేరళ మోడల్ అమలు చేసే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కేరళ తరహాలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేదలను గుర్తించడంలో మహిళా సంఘాలే కీలకం అన్నారు. వారికి ఇళ్లు, ఉపాధి, వైద్య సాయం అందిస్తామన్నారు. కాగా, ఇటీవలే భారతదేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది.