SRD: జిల్లాలోని 443 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. గ్రామాల్లో 428, పట్టణాల్లో 10, గ్రేటర్ 5 చోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం వాటా రూ.36,400, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.15,600 కేటాయించినట్లు వెల్లడించారు.