WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో రేపు MGNREGS పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని గ్రామాల్లో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలపై ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు MPDO శంకర్ నాయక్ తెలిపారు. ఈ ప్రజా వేదికకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు హాజరుకావాలని సూచించారు.