KRNL: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రాలయం సీఐ రామానుజులు సూచించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి డీజేలు, టపాసులను నిషేధించామని తెలిపారు. యువత మద్యం తాగి వాహనాలు నడిపినా, రహదారులు బ్లాక్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.