కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ప్రజల నుంచి 379 అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఈ మొత్తంలో దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిశీలించి పరిష్కరించాలన్నారు.