NZB: జక్రాన్పల్లిలో వ్యవసాయ మోటార్ల కరెంట్ బిల్లు చెల్లించలేదని లైన్మెన్ రైతుల పొలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బిల్లు చెల్లించడానికి కొంత సమయం కోరినా వినకుండా ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో, డబ్బులు కట్టిన రైతులకి కూడా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లైన్మెన్పై చర్యలు తీసుకోవాలన్నారు.