HNK: JAN 11న HNKలో లక్ష మందితో నిర్వహించే OCల సింహగర్జన సభను విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి OC ప్రజలను కోరారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఓసీ జేఏసీ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఓసీ నాయకులు సభకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.