CTR: సదుం మండలంలోని ఎరుకులపురంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ప్రమీల ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే సమావేశానికి సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు. సమావేశంలో సమస్యలను తెలుసుకోవడంతో పాటు.. పౌర హక్కులపై అవగాహన కల్పిస్తామని ఆమె వెల్లడించారు.