వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి కోనేరు హంపికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఆటపై హంపికి ఉన్న అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు.