KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. సింగరేణి, జూలూరుపాడు, ఎన్కూర్ మండలంలో పీహెచ్సీ ఆసుపత్రులను 30 పడకల ఆసుపత్రులుగా మార్చాలని ఎమ్మెల్యే కోరారు. వైరా మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక చొరవ చూపి ప్రజల అవసరార్థం అభివృద్ధి పనులు ఏర్పాటు చేపట్టాలని కోరారు.