BHPL: మండలం గొర్లవీడు గ్రామంలో నివాసాల మధ్య అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తుల కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే అశోక్ కుమార్ స్పందించి నిబంధనలకు విరుద్ధంగా టవర్ నిర్మాణం జరిగితే చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.