PPM: కురుపాం మండలం మొండెంకెళ్ళు గ్రామానికి వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంటికుప్పుల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్ల నాటి ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, నూతన వాటర్ ట్యాంక్‌ను మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.