VZM: నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహించరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు.