ASR: అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉన్నా గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాటుధర లభించడం లేదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. సోమవారం అరకులోయ గిరిజన భవనంలో విలేకరుల సమావేశంలో బాలదేవ్ మాట్లాడారు. కేజీ కాఫీ గింజలకు రూ. 600లు, చెర్రీ కాపీ రూ. 300లు, కాఫీ పండ్లకు రూ.150లు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.