SRPT: నూతన సంవత్సర వేడుకల పేరిట యువత రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని షీ టీం ఎస్సై నీలిమ సూచించారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేధింపులకు గురైతే 100 లేదా 1930 నంబర్లకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అనంతరం కళాబృందం చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.