BPT: రేపల్లె ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4 ఫిర్యాదులు స్వీకరించామని ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. చెరుకుపల్లి, నగరం, కొల్లూరు, రేపల్లె మండలాల నుంచి ఒక్కొక్క ఫిర్యాదు వచ్చిందన్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణ పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.