సత్యసాయి: కదిరిలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈనెల 30న ఉదయం 3.30 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.