VSP: కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.