GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి మార్కెట్ యార్డులో సోమవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, రైతుల మధ్య చర్చ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మిరపలో నల్ల తామర పురుగు, వైరస్ నివారణ పద్ధతులు, పత్తిలో గులాబీ రంగు కాయదులుచు పురుగు నియంత్రణపై అవగాహన కల్పించారు.