KRNL: ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరని, చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయంలో మండల విద్యాధికారి మొహినుద్దీన్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు ఆధ్వర్యంలో మొహినుద్దీన్ను ఘనంగా సన్మానించారు.