PLD: వినుకొండ పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద రూ. 2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే టిడ్కో ఇళ్లకు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని తెలిపారు.