VZM: వేపాడ మండలం అరిగి పాలెంలో ఈ నెల 19న జరిగిన అగ్ని ప్రమాదంలో ముక్కా శ్రీను, పెద్ద అప్పారావుకు చెందిన పశువుల పాకలు పూర్తిగా దగ్ధమై, పశువులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ సోమవారం బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.