NLG: చిట్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏబీవీపీ నాయకులు సోమవారం ఎంఈవో సైదా నాయక్‌కు వినతిని అందించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పరిశీలన జరిపి సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎంజీయూ ఏబీవీపీ ఉపాధ్యక్షులు కొంపల్లి సూర్య విజ్ఞప్తి చేశారు.