NZB: నవీపేట్ స్టేషన్ ఏరియాలో సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని మురికి కాలువలు, రహదారుల వెంట అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను, జెసీబీ సాయంతో తొలగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ శారద, ఉప సర్పంచ్ మూస, వార్డ్ మెంబర్లు తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.