SRD: జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెడిపోయిన రోడ్లను బాగు చేయాలని సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కోనేటి మాణిక్యరావు సమస్యను ప్రస్తావన తెచ్చారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ చెడిపోయాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరారు.