చైనా ఇప్పటికే రోబోలను సృష్టించి వాటితో అనేక ప్రయోగాలు చేస్తోంది. ఒకవేళ సరిహద్దుల్లో చైనా రోబో సైన్యాన్ని మోహరిస్తే.. భారత్కు అది పెను సవాలే. అవి యుద్ధానికి దిగితే వాటిని ఎదుర్కోవటం ప్రస్తుతం అనితరసాధ్యం. దీంతో భారత్ వైపే ప్రాణనష్టం ఉంటుంది. తద్వారా చైనా పైచేయి సాధిస్తుంది. దీని దృష్ట్యా భారత్ కూడా రోబోల తయారీపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.