VZM: అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని అంబేడ్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఇవాళ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతూ.. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు భూమి ఇవ్వాలని నినాదాలు చేశారు. SC, ST సబ్ ఫ్లాన్ నిధులు మంజూరు చేయాలని, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.