AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. ఈ మేరకు తుని GRP కేసు నమోదు చేసింది. ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తోంది. దగ్ధమైన B1, M2 బోగీల నుంచి ఆధారాలు సేకరించి, రెండు బోగీల వీడియోగ్రఫీ చేసింది. RPF, GRP, రైల్వే అధికారులతో మాట్లాడిన RFSL ఏడీ గీతామాధురి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.