ELR: ద్వారకా తిరుమల శ్రీవారు ఈరోజు రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో దర్శనమిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం వరకు స్వామివారు ఈ నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ మూర్తి తెలిపారు. ఎటువంటి అలంకరణలు లేకుండా, దీపపు వెలుగుల్లో స్వామివారు దర్శనమివ్వనున్నారు