AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాద మృతుడు చంద్రశేఖర్ సుందర్ కుటుంబానికి రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు రైల్వే DRM మోహిత్ సోనాకియా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. రైల్వే బోగిల్లో మంటలు ఎలా అంటుకున్నాయనే కోణంలో ఫోరెన్సిక్ బృందంతో లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.