CTR: గుడిపాల మండలం నంగమంగళం, గట్రాళ్లమిట్ట గ్రామ పంచాయతీలకు చెందిన ఓం శక్తి మాలధారణ భక్తులు మేల్మరువత్తూరు వెళ్ళి రావడానికి ‘జీజేఎం ఛారిటబుల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం ఈ బస్సు యాత్రను ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో సంస్థకు ఓం శక్తి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు