కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు రామడుగుల వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులు రూ.1,16,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.