ATP: పుట్లూరు మండలంలో వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా సంజీవపురం, సూరేపల్లి గ్రామాల మధ్య ఎనిమిది బోరు బావుల వద్ద విద్యుత్ వైర్లు కత్తిరించి దోచుకెళ్లారు. వరుస దొంగతనాలతో పెట్టుబడి నష్టపోతున్నామని రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు.