NDL: తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పీవీ శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున కుటుంబసమేతంగా మహానందిలో పూజలు నిర్వహించారు. శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.