KNR: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుందరగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు సుందరగిరి ఆలయ కమిటీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాల ప్రత్యేక పూజల నిర్వహణకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.