TG: అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, తమ భాషను మార్చుకోవాలని కోరారు. ఈ క్రమంలో వెంకటరమణా రెడ్డి ప్రస్తావించిన అంశంలో పూర్తిగా మద్దతు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.