TG: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? రారా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన వచ్చారు.. కానీ వచ్చినట్టే వచ్చి వెనుతిరిగారు. పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా, కేవలం రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లిపోయారు. బాస్ గట్టిగా మాట్లాడతారని ఆశించిన గులాబీ శ్రేణులకు మరోసారి నిరాశే మిగిలింది. దీంతో గులాబీ బాస్ ‘ఊరించి.. ఉసురుమనిపించారు’ అంటూ జనం చర్చించుకుంటున్నారు.