MHBD: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మేఘన, భావన మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువతులు ప్రమాదానికి గురవడంతో సోమవారం వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావనగా గుర్తించారు.