ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రావిన్స్ రాజధాని మనడో సులవేసిలోని నర్సింగ్ హోమ్‌లో జరిగిన ప్రమాదంలో 16 మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి 12 మందిని కాపాడారు.