MDK: నిజాంపేట మండలంలో మాజీ సర్పంచులను పోలీసులు సోమవారం ముందు అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులు మంజూరు కాకపోవడంతో అప్పులు చేసి గ్రామాలలో పనులు కొనసాగించామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.