W.G: తణుకులో ఫ్లెక్సీల వివాదంతో పోలీసుల పహారా కొనసాగుతోంది. తణుకు తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఇటీవల టీడీపీ, వైసీపీ నాయకులు వివాదం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించడంతో మరోసారి ఫ్లెక్సీలు వివాదం తెరపైకి వచ్చింది.