NLG: చిట్యాల మండలం వెలిమినేడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ని గ్రామానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు. అయ్యప్ప దేవాలయ సన్నీధానం స్వాములు అంశల అనిల్ కుమార్, గురుస్వాముల చిట్యాల పాండు, చిన్నం నర్సింహా, వేశాల రామకృష్ణ తదితరులు పాల్గొని చంద్రారెడ్డికి అయ్యప్ప జ్ఞాపికను అందించారు.