KMR; పిట్లంకు చెందిన యువకుడు తుకారాం సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కాగితం పడవలు’ విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న ఘనంగా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.