ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకుంటారు. రేపు మక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి.