VZM: ఇటీవల విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన గుర్ల మండలానికి చెందిన జమ్ము వెంకట అప్పలనాయుడిని ఆదివారం ZP ఛైర్మన్, YCP జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వివరాలు, చికిత్సపై కుటుంబ సభ్యులతో చర్చించారు. అతడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.