AP: అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం రైలు అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరమని అన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.