MDCL: ఉప్పల్ మండలం పరిధిలో 8 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయని మండల విద్యాధికారి రామారావు తెలిపారు. పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.