ELR: పార్టీ అధినేతలు 15 సంత్సరాలు కలిసి ఉంటామని ప్రకటిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. నరసాపురం, పోలవరం సహా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కూటమి ఇన్ఛార్జ్లు వేర్వేరుగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధినేతల ఆదేశాలున్నా.. స్థానిక నేతలు కలిసి సాగకపోవడంతో ఎవరికి వినతులు ఇవ్వాలో తెలియక ప్రజలు అయోమయవుతున్నారు.