NGKL: తిమ్మాజీపేట మండలం ఆవంచ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ జంగయ్య (40) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. GPకి చెందిన ట్రాక్టర్ను జంగయ్య నడుపుతుండగా అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి కిందపడిపోయారు. ఈ క్రమంలో ట్రాక్టర్ టైరు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.